ప్రతిరోజూ ఒక కొత్త ప్రారంభం, అన్వేషించడానికి తాజాగా ఎన్నో అవకాశాలను అందిస్తుంది. అయితే, జీవితం ఊహించనివిదంగా ఉంటుంది, అందువల్ల ఇవాల్టి జాతకం, మీ రోజు ఎలా పురోగమిస్తుందనేది తెలుసుకోవడం మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. మీకు ఏమి జరుగుతుంది, జరగబోతోందని అర్థం చేసుకోవడానికి అన్ని రాశుల కొరకు ఉచిత రోజువారీ జాతకాన్ని చెక్ చేయండి. మీరు ఎదుర్కొనగల ఏవైనా అడ్డంకులకు సన్నద్ధం అవుతున్నప్పుడు మీ అత్యుత్తమ క్షణాలను లెక్కించండి.
"హారోస్కోప్" అనేది రెండు పదాల సమ్మిళితం- "హార్" అంటే గంట, మరియు "స్కోప్" అంటే- వీక్షించడం అని అర్థం. అందువల్ల, హారోస్కోప్ అనే పదం- ఆ గంటను వీక్షించడం అనే అర్థాన్ని ఇస్తుంది. జాతకాలు సూర్యుడు, గ్రహాలు, చంద్రుడు మొదలైన ఖగోళ వస్తువుల అధ్యయనానికి సంబంధించినవి మరియు వాటి కదలికలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని తెలియజేస్తాయి.
మీరు పుట్టిన సమయం ఆధారంగా జ్యోతిష్యాలు రూపొందించబడ్డాయి, ఒక నిర్ధిష్ట ప్రదేశంలో నిర్ధిష్ట సమయం వద్ద విభిన్న గ్రహస్థానాలను నిర్వచిస్తాయి, ఇది ప్రతిఒక్కరికి విభిన్నంగా ఉంటాయి.
ప్రతి జాతకంలో హిందూ జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 ఇళ్లు (భవాలు) ఉంటాయి. మీ జాతకచక్రాన్ని సరిగ్గా విశ్లేషించడం వల్ల మీ భవిష్యత్తు గురించి మాత్రమే కాకుండా, గత కర్మలు మరియు వర్తమానం గురించి కూడా తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. 12 ఇళ్లతో పాటు, జాతక ఛార్టుల్లో గ్రహాలు, రాశులు, అంశాలు, లక్షణాలు, ప్రవర్తన, ఒక నిర్దిష్ట వ్యక్తి ఇష్టాలు/అయిష్టాల గురించి సమాచారం కూడా ఉంటుంది.
జాతకాలను అధ్యయనం చేయడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో అనుకూలమైన మరియు అననుకూల సమయాలను గుర్తించవచ్చు. చార్ట్‌లు కెరీర్, ప్రేమ జీవితం, సంబంధాలు, వ్యక్తితో రాశుల పొంతనం మొదలైన వాటికి సంబంధించిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వగలరు,. మీ జీవితంలో మీకు దక్కే అదృష్టాలు, మీ జీవితంలోని ఎదురుదెబ్బలు, వివాహం చేసుకోవడానికి సరైన సమయం, ఇబ్బందులు, మరియు మరెన్నో విషయాలను మీరు రోజువారీ జాతకం/జ్యోతిషశాస్త్ర ఛార్టు నేర్చుకోవచ్చు.
వైదిక జ్యోతిషశాస్త్ర భావన ప్రకారం, లగ్నం (సూర్య రాశి) మరియు రాశి (చంద్ర రాశి) రెండూ మీ జాతకంలో ముఖ్యమైన కారకాలను, ఛార్టు వాటి గురించి స్పష్టమైన సమాచారాన్ని అందిస్తాయి. అయితే, ప్రతిఒక్కరికి వీటి మధ్య ఉండే తేడా తెలియదు మరియు తరచుగా గందరగోళానికి గురవుతారు. మీ జీవితంలో ప్రతిరాశి ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, లగ్నం (సూర్య రాశి) మీ రాశిచక్రం వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తుంది, మీ లక్షణాలు, వ్యక్తిత్వం, ప్రవర్తన మొదలైన ముఖ్యమైన అంశాలను హైలైట్ చేస్తుంది, ఒక వ్యక్తిగా మీ నమ్మకాలు లేదా విశ్వాసాలను కూడా తెలియజేస్తుంది. మీ లగ్నరాశిని కనుగొనడం చాలా తేలిక, మీ పుట్టిన తేదీని మరియు మీరు పుట్టిన రాశి నెలలను గమనించడం ద్వారా దీనిని కనుగొనవచ్చు. రాశిచక్రంలో మేష రాశి నుండి మీన రాశి వరకు 12 రాశులు ఉన్నాయి, ప్రతి రాశిచక్రం ప్రతి వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే గ్రహం పరిపాలిస్తుంది.
మీరు పుట్టిన సమయంలో చంద్రుడి స్థానం ఆధారంగా మీ రాశిని పొందవచ్చు. మీకు రాశిని తెలుసుకోవడానికి మీరు పుట్టిన ఖచ్చితమైన సమయం, తేదీ మరియు ప్రదేశం మీకు అవసరం. చంద్ర రాశులు 12 రాశుల చుట్టూ తిరుగుతాయి, ప్రతి ఒక్కదానిలో దాదాపు 2 రోజులు ఉంటాయి.
సూర్యరాశి మీ వ్యక్తిగతం గురించి తెలియజేస్తే, చంద్రరాశి దానికి విరుద్ధంగా, మీ మనోభావాలు మరియు భావోద్వేగాల గురించి మాట్లాడుతుంది. ఉదాహరణకు- మీరు మకర రాశివారు అయితే, మీరు మరింత క్రమశిక్షణ మరియు అధిక సంకల్పశక్తితో ఉంటారు. అయితే, ఒకవేళ మీరు మీనరాశి వారు అయితే, మీరు ఉద్వేగభరితంగా, కలలు కనేవారిగా ఉండే లక్షణాలను కనపరుస్తారు, ఆత్మపరిశీలన చేసుకునే ప్రవర్తనను ఉంటుంది. కొన్నిసార్లు, ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట రాశి (లగ్నం లేదా రాశి) వైపు మొగ్గు చూపవచ్చు, అటువంటి సందర్భాల్లో, వారు మొగ్గు చూపే వైపును బట్టి, వారి ప్రవర్తన తదనుగుణంగా ప్రభావితం కావడం మొదలవుతుంది.
సూర్య రాశులు మరియు చంద్ర రాశులు రెండూ రాశిచక్రంలోని రాశులను అనుసరిస్తాయి. మీ పుట్టిన తేదీ, సమయం మరియు పుట్టిన ప్రదేశం అవసరం, అయితే, ఈ రెండింటిని వేరుచేసే ఒక అంశం ఏమిటంటే - చంద్ర రాశికి పుట్టిన సంవత్సరం, నెల, రోజు, సమయం మరియు ప్రదేశానికి సంబంధించిన మరింత ఖచ్చితమైన సమాచారం అవసరం. సూర్యుడు 12 నెలల్లో 12 రాశుల్లో సంచరిస్తాడు, అంటే ప్రతిరాశిలో ఒక నెలరోజులపాటు ఉంటాడు. చంద్రుడు, దానికి విరుద్ధంగా, ఒక నిర్ధిష్ట రాశిలో కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు. అందువల్ల, మీ చంద్రరాశిని లెక్కించడానికి, మీకు మీరు పుట్టిన సమయం మరియు ప్రదేశం ఖచ్చితంగా తెలియాలి.
ప్రాచీన కాలం నుంచి, మానవులుు వారి జీవిత మార్గంలో ప్రేరణ లేదా మార్గదర్శనం కొరకు నక్షత్రాలను గమనిస్తున్నారు. జ్యోతిషశాస్త్రం ఒక పురాతన శాస్త్రం, ఇది భూమిపై ఉన్న ప్రతి ప్రాణిని, సృష్టిని మరియు సంఘటనను అనుసంధానించే విశ్వ జ్ఞానం యొక్క అత్యంత మర్మమైన వ్యవస్థ. అందువల్ల, చాలామంది మునులు మరియు జ్యోతిష్యులు జ్యోతిష్యాన్ని భవిష్యవాణిగా పేర్కొంటారు.
క్లిక్‌ఆస్ట్రో జ్యోతిష్యాన్ని ఒక కళ మరియు శాస్త్రంగానూ అర్థం చేసుకుంటుంది. జ్యోతిష్యులు ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని గణిత, జ్యామితీయ మరియు ఖగోళ విధానాలు ఉపయోగించి గణన చేస్తారు కనుక, జ్యోతిషశాస్త్రం యొక్క శాస్త్రీయ భాగం చాలా ప్రముఖంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్ర అంచనాలు పరిశీలనలు మరియు శాస్త్రీయ పద్ధతులు మరియు భవిష్యవాణులపై పరస్పరం ఆధారపడి ఉంటాయి.
పురాతన కాలంలో, జ్యోతిష్కులు ఆకాశాన్ని గమనించారు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు విశ్వం చుట్టూ ఒక మార్గాన్ని ఎలా అనుసరిస్తాయో గమనించారు. వారు వాటిని నమోదు చేశారు, దాని ఆధారంగా, ఒక వ్యక్తి గురించి వారి భవిష్యత్తు రూపాల గురించి ఖచ్చితమైన అంచనాలు వేయడానికి వారు జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా తీసుకువచ్చారు.
క్రమేపీ, ఖగోళ వస్తువులు ఉండే నిర్దిష్ట స్థానం వాతావరణంలో మార్పులు మరియు ఒకరి జీవితంలోని ఘటనలకు ఎలా అనుగుణంగా ఉన్నాయో కూడా వారు గమనించడం ప్రారంభించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, జ్యోతిషశాస్త్రం విశ్వానికి సంబంధించిన విస్తారమైన జ్ఞానం మరియు అవగాహన కల్పించే పురాతన వ్యవస్థ, ఇది భవిష్యవాణి మరియు సహజ దృగ్విషయాన్ని ఉపయోగించి మన జీవితాలను నియంత్రించడానికి స్వీయ-జ్ఞానాన్ని మరియు అవగాహనను అందిస్తుంది.
ఈ రోజు రాశి ఫలాలు కోసం, మీరు మీ రాశికి సంబంధించిన క్లిక్‌ఆస్ట్రో రోజువారీ జ్యోతిష్య ఫలితాలను గమనించవచ్చు. పన్నెండు రాశులను అగ్ని, నీరు, గాలి మరియు భూమికి సంబంధించిన మూలకాల సమూహాలుగా వర్గీకరిస్తారు. ఉదాహరణకు, అగ్ని సమూహంలో మేష రాశి, సింహం మరియు ధనుస్సు రాశులు ఉంటాయి, అయితే నిర్దిష్ట రాశికి చెందిన ప్రతి వ్యక్తి తమ అగ్ని స్వభావాన్ని తమకే ప్రత్యేకమైన రీతిలో వ్యక్తీకరిస్తారు.
క్లిక్‌ఆస్ట్రోలోని మీ రోజువారీ జ్యోతిష్య రిపోర్ట్, మీ రోజు ఎలా ఉండబోతోందనే విషయం గురించి మరింత తెలుసుకోవడానికి మీకు సాయపడగలదు. ఖగోళ వస్తువుల స్థానం. కదలికల ఆధారంగా మీ దినచర్యలో మీరు ఎదుర్కొనే అన్ని అడ్డంకులను ఇది హైలైట్ చేస్తుంది. ఇంకా, మీ రోజువారీ జాతకఫలాల ఇంగ్లిష్ రిపోర్టును ఉపయోగించి, మీ వ్యక్తిత్వం, కెరీర్, ప్రేమ జీవితం, ఇతరులతో సంబంధాల గురించి మీరు లోతైన అవలోకనాన్ని పొందవచ్చు, ఇతర రాశులతో మీ పొంతనం కూడా తనిఖీ చేయవచ్చు.